31 C
Hyderabad

సీఎం రేవంత్‌కు రాజాసింగ్‌ థ్యాంక్స్‌

Must read

📰 Generate e-Paper Clip

 

ీబతుకమ్మ, వెబ్‌ డెస్క్‌

గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని ప్రకటనపై సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు, విధివిధానాలపై కమిటీని వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను ఇల్లీగల్‌ స్లేటర్‌ హౌస్‌లో చంపుతున్నారని, దాని గురించి సీఎం ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ గురించి చెప్పాలని కోరారు. మోడల్‌ గోశాలలు కడుతున్నారని. ఇది చాలా మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.

More articles

Latest article