25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాసం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని కోడి 55 అంగన్వాడి కేంద్రానికి నూతనంగా వచ్చిన పిల్లలకు అంగన్వాడీ టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన పిల్లలకు వారి తల్లుల ను స్వాగతం పలికి పిల్లలతో అక్షరాలు రాయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాన్ని పూలతో, పచ్చని తోరణాలతో, పప్పు దినుసులతో, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలో అంగన్వాడి  తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article