28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మార్పీఎస్ జెండా రెపరెపలాడాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీఎస్ డిస్ట్రిక్ట్ కో ఇంచార్జీ యాడవెల్లి అజయ్ మాదిగ

 

వేల్పూర్, బతుకమ్మ : మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి 31 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జులై 7న గ్రామ గ్రామాన మాదిగల ఆస్థిత్వ చిహ్నమైన ఎమ్మార్పీఎస్ జెండాను రేపరేపాలడించాలని ఉస్మానియా యూనివర్సిటీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, డిస్ట్రిక్ట్ ఎమ్మార్పీఎస్ కో ఇంచార్జ్ యాడవెల్లి అజయ్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలను నిర్మింపజేసి,ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగురవేసి మాదిగల చైతన్యాన్ని ప్రదర్శించాలన్నారు. విశిష్ట అతిథి,డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ 30 యేండ్ల మాదిగల ఉద్యమ చరిత్రను నెమరువెసుకొని, ఉద్యమ నాయకుడు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగకు అండగా నిలిచి గ్రామ గ్రామాన మాదిగల ఆస్థిత్వాన్ని చాటాలన్నారు.మాదిగలు మాదిగల కోసమే కాకుండా సబ్బండ కులాల కోసం పోరాటం చేసిన చరిత్ర ఉందని, ఈ చరిత్రను నిర్మించింది మంద కృష్ణ మాదిగనేనన్నారు. ఈ సమావేశం లో మండల ఎమ్మార్పీఎస్ ప్రెసిడెంట్ తెడ్డు శివరాజ్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి బక్కోళ్ల ప్రశాంత్ మాదిగ, మండల నాయకులు, గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article