ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హాసనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాలు విరిగిపోయింది. ఎల్లారెడ్డి నుండి ఇంటికి వెళ్తుండగా, తాడ్వాయి మండలానికి చెందిన మహీంద్రా వాహనం బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
