తూప్రాన్ టోల్ గేట్ వద్ద తప్పించుకున్న వైనం
విచారణ చేపడుతున్న పోలీసులు
వెబ్ న్యూస్, బతుకమ్మ: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద ఆదివారం ఉదయం కిడ్నాప్ కలకలం రేపింది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్ ను కొందరు వ్యక్తులు అతడి ఇన్నోవా వాహనంలోనే కిడ్నాప్ చేసి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద వాహనం వేగం తగ్గడంతో కిడ్నాపర్ల చెర నుంచి హరీశ్ తప్పించుకుని తూప్రాన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు హరీశ్ ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై నిర్మల్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.
