మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ సమక్షంలో శనివారం మోర్తాడ్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ గా అర్గుల్ రమేష్ ని నియమించడం జరిగిందని మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాముడు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్క భూమన్న, జిల్లా కార్యదర్శి గిర్మాజీ గోపి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్, వై శ్రీ, శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
