25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒడిశాలో అవమానవీయ ఘటన

Must read

📰 Generate e-Paper Clip

కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరోముండనం

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఒడిశాలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబసభ్యులు 40 మందికి గ్రామ పెద్దలు శిరోముండనం చేయించారు. రాయగడ జిల్లా గోరఖ్ పూర్ పంచాయతీలోని ఓ గ్రామంలో షెడ్యూలు కులానికి చెందిన యువకుడిని ఆదివాసీ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువతి కుటుంబసభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 3 రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకొని తిరిగి ప్రేమజంట గ్రామానికి వచ్చింది. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలియడంతో గ్రామ కట్టుబాట్ల ప్రకారం, గ్రామ పెద్దలు యువతి కుటుంబసభ్యులను గ్రామం నుండి వెలివేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి 40 మంది యువతి కుటుంబసభ్యులు శిరోముండనం చేసుకొని, మూగజీవాలని బలిచ్చి, ప్రేమ జంటకు పెద్దకర్మ చేశారు. దీనిపై పోలీసులను వివరాలు అడగగా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

More articles

Latest article