ఒడిశాలో అవమానవీయ ఘటన
కులాంతర వివాహం చేసుకున్నందుకు శిరోముండనం వెబ్ న్యూస్, బతుకమ్మ : ఒడిశాలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబసభ్యులు 40 మందికి గ్రామ పెద్దలు శిరోముండనం చేయించారు. రాయగడ జిల్లా గోరఖ్ పూర్ పంచాయతీలోని ఓ గ్రామంలో షెడ్యూలు కులానికి చెందిన యువకుడిని ఆదివాసీ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. యువతి కుటుంబసభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 3 రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకొని తిరిగి ప్రేమజంట గ్రామానికి వచ్చింది. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలియడంతో గ్రామ...