27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నేలకూలిన చెట్ల తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్ నుంచి నందిపేట్ వైపు వెళ్లే దారిలో ఈదురుగాలులకు కూలిన చెట్లు

స్థానిక ఎస్సై రాజశేఖర్ కు మాక్లూర్ మండల ప్రజల అభినందన

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ నుంచి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్ హుటాహుటినా చెట్లను తొలగించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మండల వ్యాప్తంగా ఈదురు గాలులకు ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపడతామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఎస్సై రాజశేఖర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రికి రాత్రే సహాయ చర్యలు చేపట్టి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశాడు.  రోడ్లపై చెట్లను జేసీబీల సహాయంతో తొలగించాడు . మండల ప్రజానీకం ఎస్సై రాజశేఖర్ కు అభినందనలు తెలుపుతున్నారు. వర్షా కాలంలో పురాతన పెంకుటిల్లలో ఉండకూడదని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రాజశేఖర్ ప్రజలకు సూచించారు.

Removal of fallen trees

More articles

Latest article