24 C
Hyderabad
Sunday, August 2, 2026

రివర్షన్ లేకుండా బదిలీ..

Must read

📰 Generate e-Paper Clip

  • లేని పక్షంలో నిరసనలు
  • ఎస్ఈ కి నోటీస్ ఇచ్చిన ఈజాక్

 

ఇందూర్, బతుకమ్మ: ఓ అండ్ ఎం సిబ్బందికి రివర్షన్ ఇవ్వకుండా డిచ్ పల్లి డివిజన్ కు బదిలీలు చేయాలని నిజామాబాద్  ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ రవీందర్ ను సోమవారం జాక్ ఆధ్వర్యంలో కలిసి డివిజన్ కు సిబ్బంది కేటాయింపులో  జరుగుతున్న జాప్యంపై చర్చించి నోటీస్ అందజేశారు. ఈ సందర్బంగా ఈ జాక్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పదోన్నతులను  కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేసారు. ఇప్పుడున్న పరిస్థితులలో రివర్షన్ ఇచ్చి బైఫరికేషన్ చేస్తే చాలా మంది కార్మికులు పదోన్నతి లేకుండానే ఉద్యోగ విరమణ చేస్తారని ఆవేదనను వ్యక్తం చేసారు.   విద్యుత్ కార్మికులు ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నందున బై ఫర్ కేషన్  జూన్ 9 నుంచి తీసుకొని అందరికీ న్యాయం చేయాలని కోరారు.  ఒకవేళ చేయని పక్షంలో జిల్లా ఈజాక్ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి ఈ నెల 16 నుంచి తమ  నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈజాక్  చైర్మన్ రఘునందన్,  కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, మల్లేష్, గంగారం నాయక్, సురేష్, రాజేందర్ రెడ్డి, కాశీనాథ్, బాలేష్ కుమార్, శానం శివ కుమార్, మన్మోహన్, శ్యాం కుమార్, నగేష్, చంద్రశేఖర్, రాజేందర్  పాల్గొన్నారు.

More articles

Latest article