ఆర్మూర్, బతుకమ్మ: ఆర్థికంగా వెనుకబడిన పేదల కుటుంబాల్లో ఐకెపి ద్వారా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు మహిళలకు రుణాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపుతూ నాడని తెలపడంలో అతిశక్తి లేదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సొంత శక్తితో జీవితంలో వ్యాపారాలు చేస్తూ ఎదగాలని ఆశతో అనేకులకు వివిధ చిన్న చిన్న కిరాణా షాప్, టైలరింగ్, పాడి పరిశ్రమ, లేడీస్ జనరల్ స్టోర్, బట్టల దుకాణము, పిండి గిర్ని తదితర వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తు అందరి మన్ననలు పొంది జాతి అవార్డు అందుకున్న సందర్భంగా ఐకెపి మాణిక్యం ను ఆదివారం గోవింద్ పెట్ గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ చేతుల మీదుగా లక్ పతి దీదీ కాన్ స్లేవ్ 2025 ఒడిస్సా లోని భువనేశ్వర్ లో జాతీయ అవార్డును అందుకొని జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో నిలపడం సంతోషకరమైన విషయమని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు వసంత, అపూర్వ, మౌనమి తదితరులు పాల్గొన్నారు.
