27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అగ్రవర్ణాలకు అమృతం.. అణగారిన వర్గాలకు విషం..

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  రాష్ట్ర కమిటీ ఆదేశాలమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రం లో వినాయక్ నగర్ లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపనికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల అమరవీరుల స్తూపం గా నామకరణం చేశామని : బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  జిల్లా ఇంచార్జ్ ప్రేమ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం లో  బలై పోయిన అమరవీరులంతా  99% బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలే అని, అధికారం లోకి వచ్చిందంత అగ్రకుల దొరలు, విషం బీసీ ఎస్సీ ఎస్టీ లకు వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర  కార్యదర్శి సుమన్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్,  బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  జిల్లా ప్రతినిధులు ప్రశాంత్, డీఎస్పీ మండల అధ్యక్షులు  మైపాల్,ముఖ్య నాయకులు గోపి,మోహన్,ఆత్మ గౌరవ్ పాల్గొన్నారు.

More articles

Latest article