27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఘరానా దొంగల ముఠా అరెస్ట్

Must read

  • 8 మంది అరెస్టు..15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
  • 39 కేసులలో నిందితులు
  • నిందితులంతా నేర చరిత్ర కలిగిన వారే
  • వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరం తో పాటు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ  నగరంలోని 6 వ టౌన్ పరిధిలో ఇటీవల వరుస దొంగతనాలు నమోదు కావడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణ లో అమేర్ దొంగతనాలు చేసే క్రమంలో ధర్మపురి హిల్స్ కు  చెందిన మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆసిఫ్ తో ఉన్న పరిచయం ద్వారా వాసిమ్,సోహెల్, జావిద్ ఖాన్, రియాజ్, ఆలీ ఆసిఫ్ ఖాన్ లను పరిచయం చేసుకొని పక్క ప్రణాళికలతో నేరాలకు పాల్పడినట్లు సిపి తెలిపారు. అందులో భాగంగా నగరంలోని ఐదు,ఆరు, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 24 తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడి  15 తులాల బంగారం, ఒక కారు, మూడు బైకులను దొంగలించినట్లు తెలిపారు. దొంగల ముఠా దొంగిలించిన బంగారు సొమ్మును, విలువైన వస్తువులను షేక్ వసిం కు ఇచ్చేవారు. వసిం తనకు పరిచయం ఉన్న  మల్కాపూర్ కు చెందిన మోహన్ కు  అమ్మేవాడు. దొంగలించిన వస్తువులను తక్కువ ధర తీసుకొని దానికి బదులుగా నగదును ఇచ్చేవాడని అలా వచ్చిన నగరం అందరూ పంచుకునేవారు అని తెలిపారు.  ఈ ముఠా హైదరాబాద్ శివర్లోని పాపూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో 15 ఆటోలను కూడా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ అమీర్, ఫేక్ వసిం, సయ్యద్ రియాజ్,  జావీద్ ఖాన్, షేక్ సోహెల్, ఎండి ఆసిఫ్,మాలోత్ మోహన్  లను అరెస్టు చేసి నట్లు తెలిపారు. వీరిలో చాలామంది గతంలో అనేక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు సిపి తెలిపారు. షేక్ వసీం  మెడికేసులలో నిందితులో ఉండగా ఇతనిపై  మీర్పేట్ పోలీస్ స్టేషన్లో పీడియాక్టు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. షేక్ సోహెల్ 7 కేసులలో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. మహ్మద్ అమెర్ 21 కేసులలో నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్  10 కేసులలో నిందితురుగా ఉండగా జావేద్ ఖాన్ ఐదు కేజీలలో నిందితుడుగా ఉన్నాడు. మోహన్ గంజాయి కేసులలో ఉన్నట్టు తెలిపారు.

Gharana gang of thieves arrested

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article