ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శివానగర్ గ్రామ శివారులో ఎరుకల సాయిలు చాపల దుకాణం పక్కన నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎల్లారెడ్డి ఎస్సై తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ5,400 నగదు, మూడు వాహనాలు,4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.
