30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మోసానికి పాల్పడి తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన హ్యూమన్ రైట్స్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి విషయంలో  మోసానికి పాల్పడి తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన కాలేవర్ జ్యోతి అనే మహిళ తన తండ్రితో కలిసి డిచ్ పల్లి మండలం బీబీపూర్ తాండలో భూమి కలిగిన గారిపల్లి సుజాత నుంచి 2023 అక్టోబర్ 5న కొనుగోలు చేశారు. రూ.28 లక్షల డబ్బులు తిరిగి చెల్లించి సంబంధిత భూమిని రీరిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఒప్పందంతో భూమి కొనుగోలు జరిగింది. గతేడాది సెప్టెంబర్ 18నగారెపల్లి సుజాత, విఠల్ రాథోడ్ లు సంబంధిత భూమిని డిచ్ పల్లి మండలం కమలాపూర్ కు చెందిన మహిళకు విక్రయించేందుకు రూ.5 లక్షల అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారు. మొత్తం డబ్బులు చెల్లించి సంబంధిత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తప్పుడు  ఫిర్యాదులు చేశారని తెలిపారు. సంబంధిత భూమి వివాదంలో ఉందని ప్రచారం చేస్తున్న వారిపై అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కాలేవర్ సుజాత, రవీంధర్, హ్యూమన్ రైట్స్ సభ్యులు తేలు సరిత, పుప్పాల గీత, మోహన్ తదితరులున్నారు.

More articles

Latest article