25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆ అధికారి హల్ చల్

Must read

📰 Generate e-Paper Clip

. ఇసుక వ్యాపారులు.. ఇటు బట్టీల నిర్వాహకుల నుంచి వసూళ్లు

ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండలం రామడుగు గ్రామ పరిధిలో నుంచి మాఫియా యథేచ్ఛగా మొరం తరలిస్తోంది. ఏకంగా జేసీబీ పెట్టి తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలతో మొురం దందా అంతా ఓ అధికారి కనుసన్నల్లో కొనసాగుతుండడమే దీనికి కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు రెవెన్యూ అధికారి అర్ధరాత్రి వేళ కారులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. అలాగే ఇటుక బట్టీలు వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఆ అధికారిపై అనేక ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.

More articles

Latest article