27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 ఆహల్య భాయ్ హోల్కర్ 300 జయంతి సంధర్బంగా భారీ ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ:  

అహల్య భాయ్ హోల్కర్ 300 వ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన గోల్ హనుమాన్ చౌరస్తా నుండి మార్కండేయ మందిరం వరకు ర్యాలి జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గోని మాట్లాడుతు లోక మాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహిళా నారి శక్తికి నిదర్శనంగా నిలుస్తూ మహిళా సాధికారాతకు ఎనలేని కృషి చేసారన్నారు. ఆమె హిందూ దేవాలయాల నిర్మాణానికి గొప్ప మార్గదర్శకురాలు నిర్మాణకర్త అన్నారు. అహల్య భాయ్ భారతదేశం అంతటా వందలాది దేవాలయాలతో పాటు  ద్వారక నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు. 1780 లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ , మరమ్మత్తు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి  చేసారన్నారు. ఆమె తన పాలనలో పక్షపాతం లేకుండా  న్యాయ పరిపాలన అందించడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సాహించడం జరిగిందన్నారు.

Huge rally on the occasion of Ahalya Bhai Holkar's 300th birth anniversary

విరత్వం అనేది ఈ గడ్డలో పుట్టిన ప్రతి బిడ్డ పుట్టుకతో మన పూర్వికుల ధైర్య సాహసాలను పునికిపుచ్చుకోవడం, వారిని మనం ఆదర్శంగా తీసుకోవడం మనం చూస్తున్నాం అన్నారు. నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్నా దాడులు, హిందూ దేవాలయాలపై దాడులను హిందువులుగా అందరం సంఘాటీతం అయి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పోతన్ కర్ లక్ష్మి నారాయణ, స్రవంతి రెడ్డి, పంచరెడ్డి ప్రవళిక, నాగోళ్ల లక్ష్మినారాయణ, ఎర్రం సుదీర్, మండల గోండల సురేష్ బాబుఅధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Huge rally on the occasion of Ahalya Bhai Holkar's 300th birth anniversary

More articles

Latest article