27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కత్తితో పొడుచుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

ఆత్యవసర వైద్యంతొ ప్రా ణాలను కాపాడిన అంబులేన్స్ సిబ్బంది

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

జీవితంపై విరక్తితో ఒక వ్యక్తి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం  ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ ప్రాంతంలో గురుద్వార్ దగ్గర జరిగింది. స్థానికంగా ఉండే కాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది తన ఇంటి వద్దనే తనకు తాను కత్తితో పొడుచుకున్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో అతన్ని 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి హుటాహుటిన జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఈ ఘటనలో ఈఎంటి రాములు , పైలెట్ అజయ్ చాకచక్యంగా వ్యవహరించి వైద్యం చేయడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు కుటుంబ సభ్యులు వారిద్దరిని అభినందించారు.Man attempts suicide by stabbing himself with a knife

More articles

Latest article