27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నాణ్యమైన దిగుబడులకె బీఏఎస్ఎఫ్ వాలేక్సియో, మీబేల్యా బ్రాండ్లు

Must read

📰 Generate e-Paper Clip

  • తక్కువ మోతాదు తో ఎక్కవ ఫలితాలు
  • మార్కెట్ లోకి వినూత్న కీటక, శీలింద్ర నాశినిలు
  • బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ రానువ

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి పంట సాగులో రోగాలకు హేతువైన కీటాకాలు, శీలింద్రాలను నాశనం చేసి, అధిక దిగుబడులను రైతులకు అందించేందుకు బీ ఏ ఎస్ ఎఫ్ ఇండియా కంపెనీ వాలేక్సియో, మీబ్యేలా బ్రాండ్లను రైతులకు అందుబాటులోకి తెచ్చిందని అగ్రికల్చరల్ సొల్యూషన్స్ బీ ఏ ఎస్ ఎఫ్ ఇండియా బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ రానువ తెలిపారు. గురువారం రాజధానిలోని బంజారా హిల్స్ లోని ఓ హోటల్ లో వాలేక్సియో, మీబ్యేలా నూతన కిటక, శీలింద్ర నాశినిలను ఆయన మార్కెట్ లో రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమం లోఆయన మాట్లాడుతూ  బీఏఎస్ఎఫ్ ఇండియా తయారు చేసిన ఈ వాలేక్సియో బ్రాండ్ కీటక నాశినిగా, మీబ్యేలా శీలింద్ర నాశినిగా పని చేస్తుందని తెలిపారు. ఇతర కంపనీ బ్రాండ్లకు భిన్నంగా తక్కువ మోతాదు మందుతో దోమ పోటు, పొడ తెగులు లాంటి తెగుళ్లను నియంత్రించి రైతులకు నాణ్యమైన అధిక దిగుబడులను ఈ బ్రాండ్లు అందిస్తాయని అన్నారు. ఆధునిక గ్లోబల్ పంట పరిరక్షణ లో భాగంగా కంపెనీ కొత్తగా రైతులకు అందిస్తున్న ఈ రెండు బ్రాండ్లు భారత ఆహార భద్రత ఎజెండా కు సహాయ పడడం తో పాటు వరిపంట పట్ల కంపెనీ నిబద్దతను చాటుతూ రైతుల సమగ్ర పరిష్కారాలకు పోర్టుపోలియోను అందిస్తుందని గిరిధర్ రానువ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెవిసోల్ కేమిస్ట్రీ దేశంలోనే మొట్ట మొదటగా ప్రారంభించబడుతుందని,ఈ లేటెస్ట్ కెమిస్ట్రీ తన అనుకూలమైన రెగ్యులటరీ ప్రొఫైల్, సెలెక్టివిటీని తెగుళ్ల నుంచి వరిపంటను కాపాడుతుందన్నారు.

More articles

Latest article