27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో  ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రసాద్ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం, ఆర్టీఏనిబంధనల ప్రకారం కార్ల డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయడం నేరమన్నారు. ఇది ప్రజల భద్రతకు హానికరమని, బ్లాక్ ఫిల్మ్ వలన వాహనాలలో కూర్చున్నవారిని వెలుపల నుండి చూడలేకపోవడం వల్ల అనేక నేరాలు జరగుతున్నాయన్నారు. ప్రజలందరూ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకం నిషేదించాలని, ఎవరైనా బ్లాక్ ఫిల్మ్ వాడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడానికి ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.  ఈ తనిఖీల్లో ఆర్ వినోద్, ఆర్ఎస్సై సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article