నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వినాయక దామోదర్ వీర సావర్కర్ 142వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలోని అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులుమల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన హిందుత్వం వాదం తో దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28 మారసాలని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా “ఫ్రీ ఇండియా సొసైటీ” “అభినవ్ భారత్ సొసైటీ “సంస్థ లను స్థాపించి స్వతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్దం లాంటిది అవసమని ఆ దిశగా యువతను ఆలోచంబచేశారని తెలిపారు. “తల్వార్ ” పత్రిక “అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమం కి స్ఫూర్తిగా నిలిచారని దేశ ద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైల్ శిక్ష అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్ శిక్ష అనుభవించిన జీవితాన్ని దేశం కోసం నడిపించాలని ఆయన దేశ భక్తి యువత ఆదర్శం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ న్యాయవాదులు రాజ్ కుమార్, సుబేడార్, పిల్లి శ్రీకాంత్, శశిధర్ రెడ్డి, ఉదయ్, కృష్ణ, జయప్రకాష్, మధుసూదన్ గౌడ్, వెంకటేష్, అన్వేష్, అశోక్, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
