- ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రులు
ధర్పల్లి, బతుకమ్మ: మా పిల్లలను ప్రభుత్వ బడికి పంపిస్తాం.. ఉపాధ్యాయులు ప్రైవేట్ కు దీటుగా నాణ్యమైన ఇంగ్లీష్ బోధన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విడిసి చైర్మన్ రవి రెడ్డి కోరారు. మా మీద నమ్మకం ఉంచి బడికి పంపించండి విద్యార్థుల భవిష్యత్ కు నేను బాధ్యుడిని అని వాడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ అన్నారు. సోమవారం ధర్పల్లి మండలం వాడి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తుల, యువకుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యయ, ప్రయాసలకు తావు లేకుండా వాడి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఏలాంటి అపోహలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులను పంపించాలని కోరారు. విద్యార్థుల బాధ్యత ను తాను తీసుకుంటానన్నారు. వాడి పాఠశాలలో విశాలమైన తరగతి గదులతో పాటు, క్రీడల కోసం పెద్ద మైదానం కూడా ఉన్నదని, విద్యార్థులను క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. పూర్వ విద్యార్థులు నిధులు సమకూర్చుకొని పాఠశాలకు పెయింటింగ్ వేయించడం సంతోషకరమని, సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో విడీసీ సభ్యులు గంగా బాపు, జిన్న సాయిలు, సురేష్, బాలరాజ్, గ్రామస్తులు రాం చందర్, భూమాయి గారి సాయిలు, మహేందర్, భాస్కర్, సతీష్, గంగా మోహన్, మోహన్ రెడ్డి, దాస్ , మోహన్, రవి, శోభన్, డీలర్ గంగాధర్, బాలరాజు, రంజిత్, అరుణ్, గంగారాం,స్రవంతి, మహిళలు పాల్గొన్నారు.
