28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ ఏకగ్రీవం

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో నిర్వహించిన సమావేశంలో ముస్లిం పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షౌకతుల్ బారీ అధ్యక్షుడిగా, సయ్యద్ జమీల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవీకాలం ముగిసిన అహ్మద్ ఖాన్ స్థానంలో ఈ ఎన్నికలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో మరో సమావేశంలో ఎన్నుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు కలీమ్, మజహర్‌ఉద్దీన్, సయ్యద్ హుస్సైన్, మండల కమిటీ స్థాపకుడు షేక్ ఘౌస్, స్థానిక ఆరు మసీదు అధ్యక్షులు మరియు గ్రామ ముస్లింలు పాల్గొన్నారు.

Shaukatul Bari unanimously elected as Muslim Committee President

More articles

Latest article