26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా నాగం సురేందర్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా దేవునిపల్లి గ్రామానికి చెందిన నాగం సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి నాగం సురేందర్ అని కొనియాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సురేందర్ శిష్యులతో రెండవసారి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టారని అందుకు మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు రుణపడి ఉంటానని సతీష్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు నర్సింలు ఎరుకల సాయిలు, శ్రవణ్, ఇమ్రాన్, దయాకర్, గోపాల్ ,అరవింద్ గౌడ్, మనోజ్ పాల్గొన్నారు.

More articles

Latest article