ముస్లిం కమిటీ అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ ఏకగ్రీవం
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో నిర్వహించిన సమావేశంలో ముస్లిం పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షౌకతుల్ బారీ అధ్యక్షుడిగా, సయ్యద్ జమీల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవీకాలం ముగిసిన అహ్మద్ ఖాన్ స్థానంలో ఈ ఎన్నికలు నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో మరో సమావేశంలో ఎన్నుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు కలీమ్, మజహర్‌ఉద్దీన్, సయ్యద్ హుస్సైన్, మండల...