29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని ఆత్మకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2010 – 11 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా తిరిగి ఒకే చోట కలిసి తము విద్యార్థి దశలో పాఠశాలలో చదువుకున్న పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబోధన చేసిన అప్పటి ప్రధానోపాధ్యాయుడు ఆత్మారాం,  ఉపాధ్యాయులు శ్రీనివాస్, సాయిలు, భాస్కర్, సురేందర్, సాయిలు లను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంగమేశ్వర్, భూపాల్, అనిల్, దుర్గేష్, సంధ్య, అమ్రిన్, నగ్మా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article