29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజకీయాలకతీతంగా రైతు సంఘ నిర్మాణం జరగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సమస్యల పరిష్కారం కై రైంతంగం ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలి
  • సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ

 

సిరికొండ, బతుకమ్మ : రాజకీయాలకతీతంగా  రైతు సంఘం నిర్మాణం జరగాలని, తద్వారా lతమ సమస్యల పరిష్కారం కోసం రైంతంగం ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. మండలం లోని గడ్కోల్ గ్రామంలో శనివారం అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.)సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అబలంబిస్తుందని, కొత్త రైతు చట్టాలను తెచ్చి  వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దారతత్వం చేయడానికి, ఆదాని, అంబానీ లాంటి వారికి అప్పగించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా, ఎం.ఎస్ చట్టం చట్టబద్ధ కోసం  సుదీర్ఘంగా ఢిల్లీలో రైతాంగం పోరాడితే  రైతాంగ సమస్యలు పరిష్కారం చేస్తామని రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చినా మోడీ  పూర్తిగా విస్మరించి రైతులను నట్టేట ముంచారన్నారు. ఈరోజు రైతుల పరిస్థితి అన్నమో రామచంద్ర అన్న  చందంగా  తయారైన కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. రైతులంతా రాజకీయాలకు అతీతంగా  రైతు సంఘం గా ఏర్పాటు  పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన  కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా గాలికి వదిలేసి చేతులు దులుపుకున్నది అన్నారు. రైతన్నకి ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) జిల్లా నాయకుడు ఏం లింబాద్రి, సిరికొండ మండల కమిటీ అధ్యక్షులు  ఏం నారా గౌడ్,జిల్లా నాయకులు కే రాంజీ, ఎండి. అనిస్, బి. కిశోర్, ఎస్. కిశోర్, ఎస్.కిరణ్, ఎల్. నరేష్, టీ. భూమాగౌడ్, జే.బాల్ రెడ్డి, జే. ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article