- పేదలవి కూలగొట్టు.. పెద్దలను భయపెట్టు..
- దోచుకొని ఢిల్లీకి మూటలు పంపు
- ఇదేనా రేవంత్ రెడ్డి మీ పరిపాలన తీరు..?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పేదవాడి ఇల్లు కూలగొట్టి..డాన్ని బుచిగా చూపి పెద్దవాన్ని బయపెట్టి..కమిషన్ లు రాబట్టి ..ఢిల్లీకి మూటలు పంపు అన్న చందంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు. అక్రమ నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చివేయడం న్యాయమే అనుకుంటే ముందస్తు నోటీసులు, కనీస సమయం కూడా ఇవ్వకుండా పేదలవి మాత్రమే ఎందుకు కూల్చుతున్నారు అని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. చాలా ఏండ్ల నుండి పేద ప్రజలు అక్కడ నివసిస్తున్నారని, వారికి ప్రత్యమ్న్యాయం చూపకుండా.. పేదలపై కనికరం లేకుండా రేవంత్ రెడ్డి ఎందుకు అరాచకంగా వ్యవహరిస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి లాంటి పెద్ద లకు మాత్రం సమయం ఇస్తూ.. వాళ్ళ అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదు ? కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కమీషన్ లు ఇవ్వండి లేకుంటే మీ ఇంటి పైకి హైడ్రా పంపిస్తాం అని బెదిరిస్తున్నారని అన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు మాది ప్రజాపాలన అంటూ మైక్ ల ముందు ఉదరగొట్టే రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో కూడా చట్టం అందరికి సమానంగా వర్తింపజేయాలని తెలియదా అని ఎమ్మెల్యే అన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి పేదవాడి ఇల్లు కూల్చడం రేవంత్ రెడ్డి కి గంట పని కావచ్చు కాని కట్టడం పేదవాడి జీవిత కాలం కష్టం మనేది గుర్తు ఎరుగాలి అని ఎమ్మెల్యే హితవు పలికారు. రాచరిక పోకడలతో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు పేద ప్రజలతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు రేవంత్ రెడ్డి పై తిరగబడే రోజు తొందరలోనే వస్తుందన్నారు. కేసీఆర్ ని కాకుండ ఇయన్ని ఎందుకు ఎన్నుకున్నామ అని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ కోటలు ఇదే ప్రజలు కులగొట్టడం ఖాయం అని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాళేశ్వరం పై సుప్రీం కోర్టు వాఖ్యతో కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ లు ఇవ్వడం కేవలం కేసీఆర్ ను వేదించడానికే అన్నది స్పష్టం అయ్యిందని తెలిపారు. కేసీఆర్ ని ఎదుర్కోలేక కాంగ్రెస్, బిజెపి ఒక్కటయ్యాయని,అందుకే రేవంత్ రెడ్డి కక్ష్యపూరిత రాజకీయాలకు కేంద్ర ప్రభుత్వం వంతపాడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కు గొప్ప వరప్రదాయని,తెలంగాణ కరువును పారద్రోలే ఒక్క బృహత్తర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని సీడబ్ల్యూసీ బృందం మరియు దాని చీఫ్ ఇంజనీర్ సీకేఎల్ దాస్ ,గవర్నర్ నరసింహన్,మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ,సాగునీటి రంగ నిపుణులు ఎందరో కాళేశ్వరం గొప్పతనం గురించి చెప్పిన మాటలు రేవంత్ రెడ్డి కి, బీజేపీ కి కనబడక పోవడం, వినబడక పోవడం శోచనీయం అన్నారు. మొత్తం ప్రాజెక్ట్ లో 4 శాతం అయిన మెడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన కేవలం 0.1 % విలువ గల చిన్న ప్రమాదాన్ని సరిదిద్ది రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్న సోయి మరిచి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ విఫలయత్నంగా చూయించే రేవంత్ రెడ్డి నీచపు కుట్రలో భాగమే కేసీఆర్ కు కమీషన్ నోటీసులు అని ఎమ్మెల్యే అన్నారు. మెడిగడ్డ బ్యారేజ్ లేకుండా చేసి , తద్వారా గురువు చంద్రబాబు కు గురు దక్షిణగా మేలు చేసే ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని ఎమ్మెల్యే విమర్శించారు. మొన్న గోదావరి వరదకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదు కానీ..రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్ల వరదకు కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోవడం ఖాయం అని రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే వేముల హెచ్చరించారు.
