కుటుంబ సభ్యలే హత్య చేశారని ఆరోపణ
అత్తగారింటిపై దాడికి యత్నం
ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే… సంతోష్ నగర్ కాలనీకి చెందిన పూజ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త దుబాయిలో ఉంటున్నట్లు మృతురాలి బంధువులు చెబుతున్నారు. మరిది, అత్త కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అత్తపై దాడి చేసే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువరి మధ్య తోపులాట నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. సంఘటన స్థలానికి ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ లు చేరుకొని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

