27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రెగ్యులర్ వారు వద్దు.. డిప్యుటేషన్ పై వచ్చిన వారు ముద్దు

Must read

📰 Generate e-Paper Clip

  •  సీనియర్ అసిస్టెంట్ కు జూనియర్ అసిస్టెంట్ విధులు
  •  పదేళ్లుగా సెక్షన్ మార్పిడీలేని ఉద్యోగికి విధులు
  •  డిప్యుటేషన్ ల పై వచ్చిన వారికి ప్రాధన్యత కలిగిన సెక్షన్ లు
  • వేసవి సెలవుల్లో విధులు నిర్వర్తించే డిప్యుటేషన్ స్టాప్ ద్వారా ఖజనాకు అదనపు భారం
  • విద్యాశాఖ సంచాలకుల నుంచి ఆర్ జేడీ వరకు అక్రమ డిప్యూటేషన్ ల పై ఫిర్యాదులు
  • జిల్లా అధికారులే మా వెనకాల ఉన్నారు.. మాకేం కాదని ధీమా

 

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. అక్కడ రెగ్యులర్ ఉద్యోగులు వద్దు డిప్యుటేషన్  పై వచ్చిన ఉద్యోగులు ముద్దు అనే సూత్రం పాటించడమే ఇందుకు కారణం. జిల్లా విద్యాశాఖలో కొందరు అధికారులు చెప్పిందే వేదం.. ఇచ్చిందే పోస్టింగ్.. కేటాయించిందే సెక్షన్.. అన్న చందంగా మారిందని బోధనేతర సిబ్బంది కార్యాలయ అదికారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా అడ్మినిస్ట్రేటీవ్ విభాగంలో  రెండు నుంచి మూడు సంవత్సరాలకు సెక్షన్ మార్చాలి. లేని పక్షంలో బదిలీలు చేపట్టాలి. ట్రెజరీ అనుబంధ సెక్షన్ లను మూడు సంవత్సరాలకు ఖచ్చితంగా మార్చాలి. ఆదాయం వచ్చే శాఖను  మాత్రం  నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సిందే. సెక్షన్ లకు సరిపడా సిబ్బంది ఉన్నా.. పైరవీలు, అమ్యామ్యాలకు అలవాటుపడిన జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం డిప్యుటేషన్ లు ఇస్తూ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు.

సాధరణంగా ఉపాధ్యాయులను పదో తరగతిలో మంచి రిజల్ట్ కోసం అవసరం ఉన్న చోటకు (స్కూల్)కు డిప్యుటేషన్ పై పంపించడం సాధారణమైన విషయమే. అయితే విద్యా సంవత్సరం ముగిసిన తరువాత సదరు ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో సొంత స్కూల్ లో రిపోర్టు చేయాలి. ఆ తరువాత వారికి రానున్న విద్యాసంవతర్సం అవసరాల మేరకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ డీఈవో కార్యాలయం లో (మినిస్టీరియల్ స్టాఫ్ పరిపాలన విభాగం) సిబ్బంది సరిపడినంత ఉన్నా స్కూళ్ల నుంచి డిప్యుటేషన్ లను వేయించుకోవడం, వారికి ప్రాధాన్యత కలిగిన సెక్షన్ లు ఇవ్వడం జరుగుతుందంటే అది అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ లపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఉపాధ్యాయుల మాదిరిగానే స్కూళ్ల నుంచి వచ్చిన బోధనేతర సిబ్బందికి విద్యాసంవత్సరం ముగిసి సెలవులు ఇవ్వగానే సొంత స్కూల్ కు రిలీవ్ చేయాలి. ఒక వేళ రిలీవ్ చేయకపోతే వారికి వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఎర్నింగ్ లీవ్స్ ( ఈఎల్) లు ఇవ్వాలి. దాని ద్వార ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష చెల్లించాలి ఇది ఖజనాకు భారం అని చెప్పాలి. ఇవేమి పట్టించుకోకుండా డిప్యుటేషన్ ఉద్యోగులను కొనసాగించడమే ఆరోపణలకు బలన్నిస్తోంది. డీఈవో కార్యాలయంలో స్కూల్ పర్మిషన్ సెక్షన్ సీజన్ లో లక్షలు కురిపిస్తున్నాయనేది టాక్. విదేశాలకు వెళ్లాలనుకునే ఉపాధ్యాయులు, బోదనేతర సిబ్బందికి పర్మిషన్ ఇచ్చే సెక్షన్ మంచి ఆదాయ వనరు అనేది బహిరంగ రహస్యం.  జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇన్ వార్డులు రెండు ఉండగా ఒక అవుట్ వార్డు  ఉంది. జిల్లాలోని స్కూళ్లలో, మండల విద్యా వనరుల కేంద్రాల్లో (ఎంఈవో) సెక్షన్ ల క్లర్క్ లు లేరు. డీఈవో కార్యాలయంలో మాత్రం అదనంగా ఉన్నారని నాన్ టీచింగ్ స్టాఫ్ వాపోతున్నారు.

  • ఎనిమిదేళ్లుగా కుర్చీ వదలని అధికారి

ఆదాయం దండిగా ఉన్న సెక్షన్ లో ఉంటూ జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు ఎనిమిదేళ్లుగా ఆ కుర్చీని వదలడం లేదు. విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసిన ఓ జూనియర్ అసిస్టెంట్ కు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చి బోధన్ డివిజన్ లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ అతను పైరవీతో డీఈవో కార్యాలయంలోని సర్వ శిక్ష అభియాన్ లో ఖాళీగా ఉన్న సినియర్ అసిస్టెంగ్  పోస్టుకు డిప్యుటేషన్  తెచ్చుకున్నాడు. కానీ విద్యాశాఖాదికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎస్ఏలో పోస్టింగ్ లో ఉన్న ఉద్యోగిని డీఈవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పొస్టింగ్ లో పనిచేయించడం పై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డైట్ కళాశాలకు చెందిన నలుగురు డీఈవో కార్యాలయం లోకి డిప్యుటేషన్ పై వచ్చారు. నగరంలోని ఓ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన ఒకరు, జీయూపీఎస్ కు చెందిన మరొకరు డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. డీఈవో కార్యాలయంలో ఇప్పటికే అదనంగా ఇద్దరు సిబ్బంది ఉన్నారని అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఓ సినియర్ అసిస్టెంట్ పై గతంలో పగబట్టిన డీఈవో ఒకరు ఎలాంటి సెక్షన్ ఇవ్వకపోవడంతో అతడు కొన్ని రోజులుగా ఎలాంటి పని చేయకుండానే వేతనం తీసుకున్నాడు. అక్కడ అవసరం లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి  వేతనం ఇవ్వడం విశేషం. విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ ల దందాపై ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ తోపాటు ఆర్ జేడీలకు పిర్యాదు చేశారు కొందరు ఉద్యోగులు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ దృష్టికి సైతం ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది.

More articles

Latest article