25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒక్క రూపాయి జీతం… కోట్ల విలువైన అభివృద్ధి..

Must read

📰 Generate e-Paper Clip

ప్రజాసేవే ధ్యేయంగా… అభివృద్ధే లక్ష్యంగా

ఎల్లారెడ్డికి అభివృద్ధి రూపకర్త – ప్రజల మనసు గెలుచుకున్న ప్రజానేత..

కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్

 

ఎల్లారెడ్డి,బతుకమ్మ: ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న శాసన సభ్యులు మదన్ మోహన్ నేడు ప్రజాహృదయ నాయకుడిగా నిలిచారాని కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ గురువారం పత్రికా ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఒక్క రూపాయి మత్రామే జీతం తీసుకొని మిగతా మొత్తం  ప్రజా సేవకోసమే పరితపిస్తూ ఆయనకు నిత్యవృత్తిగా మారిందని నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాధాన్యంగా తీసుకొని, ఇప్పటివరకు 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారు అని తెలిపారు.ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో  మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో ప్రజలకు ఆహ్లాదకరమైన విశ్రాంతికేంద్రం అందించడమే కాకుండా, ప్రజారవాణా మెరుగుదల కోసం బస్ స్టాండ్ నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అర్ధాంతరంగా ఆగిపోయిన 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం పాటుపడుతున్నారు అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు పట్టణంలో అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేయడం, ప్రజల ఆఖరి దహన సంస్కారాల కోసం స్మశానవాటిక నిర్మాణాన్ని చేపట్టడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు అని తెలిపారు. అతి ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో అమృత్ 2.0 పథకం ద్వారా 35 కోట్ల రూపాయలతో వచ్చే 50 సంవత్సరాలకు సరిపడేలా నీటి సరఫరా పనులను ప్రారంభించడం, ఆయన

One rupee salary... Development worth crores..

ముందుచూపు నాయకత్వానికి నిదర్శనం అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి విషయంలో ముందుండే ప్రజానాయకుడు, శాసనసభ్యులు మదన్ మోహన్ ప్రయత్నాల ఫలితంగా, దీర్ఘకాలంగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు కొత్త ఊపొచ్చింది, గ్రామాల సాగునీటి ఆశలకు మార్గం కల్పించే ఈ ప్యాకేజీ పనులకు 23 కోట్ల రూపాయల నిధులు మంజూరవడమే ఇందుకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఈ పనుల మళ్లీ ప్రారంభానికి ఎన్నో స్థాయిల్లో ప్రయత్నాలు చేసి, ప్రభుత్వ స్థాయిలో ప్రతిఫలంగా ఈ నిధులు మంజూరు కావడం మదన్ మోహన్ విశేషమైన కృషికి నిదర్శనం. సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు పునఃప్రారంభం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది.  ప్రజల అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, రైతాంగానికి జీవనాధారమైన నీటిని అందించేందుకు మదన్ మోహన్ గారు చేస్తున్న కృషి అభినందనీయమైనది తెలిపారు. అభివృద్ధికి ఇది మరో అడుగు అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. అత్యధికంగా ఎల్.ఓ.సి‌లు, సీఎం ఆర్.ఎఫ్ చెక్కులను మంజూరు చేయించి, అవి లబ్ధిదారుల ఇంటికే స్వయంగా అందించడం ఆయన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంగా సూచిస్తుందని ఈనాటికి ఎల్లారెడ్డి అభివృద్ధికి మరోపేరు మదన్ మోహన్ ఆయన నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయని, ప్రజలు ఆశాభావంతో ఉన్నారు అని అన్నారు. ఎల్లారెడ్డి అంటే వెనుకబడ్డ ప్రాతం కాదని వెనుక వేయబడిన ప్రాంతామని అలాంటి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల  ఎన్నో పనులు పెండింగులో వున్నాయి అని వాటిని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషి తో పూర్తి చేస్తున్నారు అని       వెల్లుట్ల సంతోష్ కుమార్ అన్నారు.

One rupee salary... Development worth crores..

More articles

Latest article