25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : సమ్మర్ ఆక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో లో వోల్టాజి సమస్యను పరిష్కరించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో గల పోతంగల్ గ్రామంలో గల 33/11KV సబ్ స్టేషన్ లో అదనంగా 3.15 KVA ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. దీంతో లో వోల్టేజీ సమస్య తీరుతుందన్నారు.  అదే విధంగా లింగంపేట మండలంలోని బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ సమ్మర్ ఆక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో లో వోల్టాజి సమస్యను నివారించాలని గ్రామస్థులు, రైతులు కోరడంతో అదనంగా ఒక కోటి రూపాయల నిధులతో 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేశామన్నారు. దీంతొ చుట్టు పక్కన ఉన్న 8 గ్రామాలకు లో వోల్టేజి సమస్య పూర్తిగా తొలగనుందని అన్నారు. ఈ కార్యక్రమలో జిల్లా విద్యుత్ ఆఫీసర్, మండల విద్యుత్ అధికారులు, డీఈ, ఏడీఈ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

Provide quality electricity to the people

More articles

Latest article