- టియుసిఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్
రుద్రూర్, బతుకమ్మ : పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని టీయుసీఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(టీయుసీఐ) ఆధ్వర్యంలో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, టియుసిఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్ మాట్లాడుతూ.. 139 సంవత్సరాల నాడు అమెరికా లోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్త తర్పణం చేసి 8 గంటల పని దినాన్ని సాధిస్తే, నేటి పెట్టుబడిదారి వర్గాలు 10 గంటలు,13 గంటలు కార్మికులు పని చేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే, వారి అడుగులకు మడుగులోత్తే మన దేశ పాలకులు ఏకంగా చట్టాలనే మార్చి వేసి, అమలు చేయుటకు పూనుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ నాయకులు టి. లాలయ్య, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయుసీఐ రుద్రూర్ మండల నాయకులు లత, యశోద, లక్ష్మి, శంకరమ్మ,సవిత, అనిత, మౌనిక, జ్యోతి,శిరీషా,సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
