28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బీఆర్ఎస్ హయాంలో దేవాలయాల అభివృద్ధి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: గతంలో బీఆర్ఎస్ హయాంలో దేవాలయాల నిర్మాణం కోసం రూ. 40 లక్షల ఎండోమెంట్ ద్వారా మంజూరు చేయించి దేవాలయాల అభివృద్ధి చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల గంగా మాత దేవాలయం విగ్రహ ప్రతిస్టాపన కార్యక్రమానికి  ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article