26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అవినీతికి కేరాఫ్ ఇసుక రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకె ఇస్తున్నారని,  ఎక్కడ కూడా ఈ పథకాలకు లబ్ధిదారులను గ్రామసభల్లో ఎంపిక చెయ్యలేదని, ఈ ఎంపికలో అవినీతి జరుగుతొందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి భుజాలు తడుముకుంటూ నీతి, అవినీతి అంటూ వేదాలు వల్లీస్తున్నడని, సునీల్ రెడ్డి అలియాస్ ఇసుక రెడ్డే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్ అని బీయర్ఎస్ కానిస్టెన్సీ లీడర్,డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రం లోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల లబ్దిదారులను కానిస్టెన్సీలో ఎక్కడ గ్రామ సభల ద్వారా ఎంపిక చేశారో, తుది జాబితాల్లో ఎంత మంది నిజమైన లబ్దిదారులు ఉన్నారో చూపించాలన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చెయ్యాలని, లేకపోతే లబ్దిదారులకు పథకాలు అందేవరకు ప్రజల తరపున పోరాడుతాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో చెబితే ఇసుకరెడ్డి తన పరిధిని మించి మాట్లాడుతున్నారని అన్నారు. నీతి ని గురించి నివ్వు మాట్లాడుతావా… కానిస్టేన్సీలో అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇసుకరెడ్డెనని ఆయన అన్నారు. చికటి సామ్రాజ్యనికి నివ్వు రారాజువని నీ చీకటి చరిత్ర ఎవరికి తెలియనిది కాదన్నారు. ఈ 15 నెలల కాలంలో ఇసుక ను అడ్డం పెట్టుకొని నీవు దోచుకున్నదేంతో ప్రజలకు తెలుసునని, ఒక్క బస్ కు పర్మిట్ తీసుకొని,పది బస్సులను అక్రమంగా నడిపే నివ్వు ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడడమా అని ఏద్దేవా చేశారు. ప్రజా సేవ చేస్తున్న అని చెప్పుకొనే నీవు అసలు ఎవరు, ఎమ్మెల్యేవా, ప్రజా ప్రతినిధివా. పార్టీ నాయకుడావైతే మీ పార్టీకి పనిచేసుకో, ప్రజలకు కాదు అవగాహన లేకపోతే అవగాహనా పెంచుకోవాలని ఆయన సూచించారు. నీ అభివృద్ధికి కారణం నీ దగ్గర పని చేసే ఉద్యోగులు వాళ్లకు జీతాలు ఇవ్వక, జీతాలు అడిగితే వారిపై కొట్టడానికి వెళ్లిన చరిత్ర నీదాని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో జిల్లా ప్రజలందరూ చూసారని గుర్తు చేశారు. నీవ్వు అవినీతిపరుడవు కావడం వల్లనే ప్రజలు పదే పదే ఒడిస్తున్నారని అన్నారు. గత బీయర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాలల్లో కానిస్టేన్సీలో ఉద్యోగులు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పని చేసారని, ఈ 15 నెలల్లో కానిస్టేన్సీ లోని ఉద్యోగుల పరిస్థితి ఏంటో వాళ్ళను అడిగితే తెలుస్తుందని అన్నారు. 15 నెలల్లో ఎంత మంది ఉద్యోగులు టార్చర్ భరించలేక లీవ్ పెట్టారో, ఎందరో స్వయానా ట్రాన్స్ఫర్ చేయించుకొన్నారోనని అన్నారు. ప్రభుత్వ పథకాలు జెండా మోసినవారికే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే అనిల్ చెబుతుంటే మాది నీతి ప్రభుత్వం మేము సత్య హరిచంద్రులమని అబద్దాలు చెప్పడం సరికాదని, నీ వ్యవహారం ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలతోపాటు ప్రభుత్వ పథకాలకన్నీటికి లబ్దిదారులను గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాలని ఆయన కానిస్టెన్సీ బీయర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో లబ్దిదారుల పక్షాన బీయర్ఎస్ పార్టీ పోరాటం చెస్తుందని శేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో బీయర్ఎస్ పార్టీ నాయకులు , ఏలీయా,రేగుంట దేవేందర్, ప్రవీణ్ రెడ్డి,చౌట్ పల్లి రవి, రాజగౌడ్, రేగుల్లా రాములు, నల్ల రమేష్, జన్కంపేట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article