27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీబీఎస్ఈ పది ఫలితాలలో ఎన్జీఎస్ విద్యార్థుల ప్రభంజనం

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా టాపర్గా నిలిచిన సుహావిభన్సల్ 490/500
  • 100 శాతం ఉత్తీర్ణత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో నగరంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సుహావి బన్సల్ 490/500 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలువగా,  బాసెట్టి తన్మై 466/500, హరిజిత్ భౌమిక్ 460/500, మంచెర్ల నిహాన్ రెడ్డి 456/500, పార్సా లాస్య 444/500 ఉత్తమ మార్కులు  సాధించారనీ, తమ పాఠశాలల నుండి ఒక 128 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుగా 128 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల చైర్మన్ ఖ్యాతం సంతోష్ కుమార్, కరస్పాండెంట్ క్యాతం శ్రీదేవి లు తెలిపారు. విద్యార్థుల విజయం వెనుక ఉన్న ప్రధాన శక్తిగా ఉపాధ్యాయుల అంకితభావం, నియమితమైన శిక్షణ నిలిచిందని వారు తెలిపారు. పరీక్షలకు ముందు ప్రత్యేక బోధనా తరగతులు, మాడల్ టెస్టులు, వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థులను సన్నద్ధం చేసిన ఉపాధ్యాయుల కృషి ఫలితాల రూపంలో కనిపిస్తోందనీ అన్నారు.  ఇది టీమ్‌వర్క్ విజయం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంటోనీ తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గనిర్దేశనం కలిసికట్టుగా ఈ ఫలితాలకు దోహదపడినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు విజయం సాధించినందుకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వారు అభినందనలు తెలిపారు. ఈ విజయం పట్ల పాఠశాల హెచ్ఆర్ లత, వైస్ ప్రిన్సిపాల్ సరిత, అధ్యాపక బృందం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article