నిజామాబాద్, బతుకమ్మ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ (TUCI) ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె నోటీసును డీఈఓ కార్యాలయంలో ఏడీ నాగజ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో కేజీబీవీ, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొంటారన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, నాయకురాలు రాధా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
