సమ్మె నోటీసు అందజేత
నిజామాబాద్, బతుకమ్మ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ (TUCI) ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె నోటీసును డీఈఓ కార్యాలయంలో ఏడీ నాగజ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో కేజీబీవీ, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది...