28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ మజ్లిస్‌ పార్టి అధ్యక్షులుగా మీర్ ఇలియాస్ అలీ

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)  బోధన్ పట్టణ కమిటీ ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కోత్త అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ మాట్లాడుతు…. బోధన్ కొత్త కార్యవర్గంలో  ప్రధాన కార్యదర్శి అహ్మద్ బిన్ మోసిన్, కోశాధికారి హబీబ్ ఖాన్ ఖదీర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అల్తాఫ్, సమీర్, పి ఆర్ ఓ కలీం తదితరులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కమిటీని ఏఐఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఓవైసీ, మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిలాల్  మార్గదర్శకత్వంలో ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ నెల 13న రాకాసిపేట్ లోని మర్హబా ఫంక్షన్ హాల్‌లో అభినందన సభ జరగనుందనీ, ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అని తెలిపారు. అనంతరం హజ్రత్ సయ్యద్ షాహ్ జలాల్ బుఖారీ దర్గాలో  చాదర్ కప్పడం జరుగుతుందని, అనంతరం మీర్ ఇలియాస్ అలీ నివాసంలో భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరిని ఐక్యతతో పాల్గొనాలని ఆయన కోరారు.

More articles

Latest article