28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎప్ సెట్ 2025  ఫలితాలలో వెక్టార్ కు ర్యాంకుల పంట

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

తెలంగాణ  ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్  వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. వెక్టార్ కు చెందిన శ్రీ వర్షిణి అగ్రికల్చర్ లో 1316 ర్యాంకు, ఇంజనీరింగ్ విభాగంలో మామిడి నిశాంత్ రెడ్డి 1737 వ ర్యాంకుతో జిల్లాలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఆదివారం ఎప్ సెట్ ఫలితాల వెల్లడైన తర్వాత ర్యాంకు లు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా వెక్టార్ చైర్మన్ మధు సుధన్ జోషీ మాట్లాడుతూ..ఆర్మూర్ చంద్రవదన్ రెడ్డి 2532 వ ర్యాంకు, వినాయక్ జోషి 2660, అర్గుల్ వెన్నెల 3,554, భాషేట్టి సంజన 6,218 , ఉట్నూర్  స్నిగ్ధ 7291, గొర్ల ప్రణవ్ రాజ్ 7860, అల్లరి సాహిని 8700, కర్క హర్షిత రెడ్డి 9610, రిషిక 9862 వ ర్యాంకు సాధించారని తెలియజేశారు. 36 మంది విద్యార్థులకు 20 వేల లోపు ర్యాంకులు సాధించారని అత్యధిక శాతం ఉత్తమ ర్యాంకులు అటు జేఈఈ ఐపీఈ ఎంసెట్ లో అద్భుతమైన ప్రతిభ కనబరచి ఎన్నో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ఇందూరుకు ఘన కీర్తిని తెచ్చిపెట్టారు అన్నారు. నిరంతరం విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక ప్రణాళిక అంకిత భావం గల ఉపాధ్యాయులు ఆదరణ గల తల్లిదండ్రులు అంతకుమించి నిరంతరం నిర్విరామంగా శ్రమిస్తున్న విద్యార్థులు వెక్టార్ విజయానికి కారకులని అన్నారు, ఈ కార్యక్రమంలో కళాశాల  డైరెక్టర్లు సంఘం సంతోష్, కందోళ్ల గజానంద్, కొండవీటి కార్తీక్  విద్యార్థులను అభినందించారు.

Vector ranks up in Epset 2025 results

More articles

Latest article