నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
తెలంగాణ ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్ధులు తొలి ప్రయత్నంలో అత్యుత్తమంగా రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. ఇటీవల ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించిన విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే ( లాంగ్ టర్మ్ కోచింగ్ ) లేకుండా డైరెక్ట్ ఎప్ సెట్ కు హజరై మంచి ర్యాంకులు సాధించారని పేర్కోన్నారు. ఆదివారం వెలువడిన ఫలితాలలో కాకతీయకు చెందిన విద్యార్ధులు అనాస్ ఆలీ 1766 వ ర్యాంక్, ఎం. సంకేత్ 2398, జి, వేదాక్షర్ 2881 , భవ్య శ్రీ 3310, యం. లోకేష్ 3671, ఎ వైష్ణవి 4172, జి రిషీక్ 5932, వి. నికేతన్ 6293 ర్యాంకులు సాధించగా వారిని అభినంధించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు, ప్రిన్సిపాల్స్ సందిప్, రణదిష్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్ శ్యాం, కాకతీయ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

