27.5 C
Hyderabad
Friday, July 31, 2026

వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నవీపేట్ ఎంఈఓ అశోక్

 

బతుకమ్మ,నవీపేట్ : వేసవి సెలవులలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తారీకు నుండి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని 6 నుండి 9 వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నవీపేట్ మండల ఎంఈఓ సక్కి అశోక్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో  ఈ నెల 10 నుండి  25 వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని,  ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు  నిర్వహించే ఈ క్యాంప్ లో డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , యోగ, కరాటే క్లాసెస్  నిర్వహించబడతాయని తెలిపారు. 6 నుండి 9 వ  తరగతి ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు  అవకాశం కలదని, నవీపేట్  మండల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి కల విద్యార్థులు తమ పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు.

More articles

Latest article