- నవీపేట్ ఎంఈఓ అశోక్
బతుకమ్మ,నవీపేట్ : వేసవి సెలవులలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తారీకు నుండి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని 6 నుండి 9 వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నవీపేట్ మండల ఎంఈఓ సక్కి అశోక్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 10 నుండి 25 వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఈ క్యాంప్ లో డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , యోగ, కరాటే క్లాసెస్ నిర్వహించబడతాయని తెలిపారు. 6 నుండి 9 వ తరగతి ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు అవకాశం కలదని, నవీపేట్ మండల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి కల విద్యార్థులు తమ పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు.