24 C
Hyderabad
Sunday, August 2, 2026

పహల్గాం ఉగ్రదాడి వెనుక టీఆర్ఎఫ్

Must read

📰 Generate e-Paper Clip

పాక్ ఉగ్రమూకల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేం

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ

డిల్లీ, బతుకమ్మ : పాక్ ఉగ్రమూకల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు.  ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశం నిర్వహించాయి. ఈవివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వెల్లడించారు. ఉగ్ర మూకలకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందన్నారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక టీఆర్ఎఫ్ ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని అన్నారు. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ పై ఇప్పటికే నిషేధం ఉందన్నారు. వీటిపై నిషేధంతో టీఆర్ఎఫ్  పేరుతో కార్యకలాపాలు చేస్తున్నారని విక్రమ్ మిస్త్రీ  తెలిపారు.

పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సిందూర్

పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సిందూర్ అని కర్నల్ సోఫియా ఖురేషి  వ్యాఖ్యనించారు. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ ఇస్తోంది. పాక్ లోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం. పాకిస్థాన్, పీవోకేలోను ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించామన్నారు, ఉగ్రస్థావరాలపై దాడుల్లో పాక్ పౌరులకు ఎలాంటి హని కలగలేదన్నారు.

More articles

Latest article