వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దుల్లోని కర్రెగుటల్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈవిషయాన్ని అధికార మార్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ను డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
