26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తప్పులు తడకగా ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్న విద్యాశాఖ

Must read

📰 Generate e-Paper Clip

  • క్లర్క్ నుండి డీఈఓ వరకు ఇదే తీరు
  • తప్పుల ప్రొసీడింగ్ లపై చర్యలు శూన్యం

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖలో అధికారుల తీరు నానాటికి తీసికట్టుగా మారుతుంది. కాపీ పేస్ట్ గా ప్రొసిడింగ్ లు తయారవుతున్నాయని విద్యాశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులే వాపోతున్నారు. క్లర్క్ లు తయారు చేసే ప్రొసీడింగ్ లపై సంబంధిత సూపరింటెండెంట్ తో పాటు ఏడి తర్వాత డిఈవో సంతకాలు జరిగితేనే ఆ ప్రొసీడింగ్ చెల్లుతుంది. కానీ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలో జారీ అవుతున్నా ప్రొసిడింగ్ లు మాత్రం తప్పుల తడకగా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని ట్రెజరి శాఖ అధికారులు గుర్తిస్తే కానీ విద్యాశాఖాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ పరిస్థితి ఉంటే ఎంఆర్ సీలు, కాంప్లెక్స్ ల ద్వారా వచ్చే సమాచారం ఏ విధంగా ఉంటుందోనన్న చర్చ జరుగుతుంది. ప్రధానంగా సర్వీస్ బుక్ లలో జరిగే మార్పులు, చేర్పులు విద్యాశాఖాధికారులు పట్టించుకుంటున్నారా లేదా అనే చర్చ జరుగుతుంది. విద్యాశాఖ కార్యాలయంలో పని చేసే బోధనేతర సిబ్బంది ఏళ్ళ తరబడి సీనియరిటీ ఉన్న తప్పులు చేస్తుండడం అవి ఖజానా శాఖాధికారులు పసిగట్టి వెనక్కి పంపుతుండడంతో విద్యాశాఖ కార్యాలయం అధికారుల తీరు బట్టబయలైంది.

జిల్లా విద్యాశాఖలో ప్రొసిడిగ్స్ జారీ తప్పుల తడకగా ఉందని కింది ప్రొసిడింగ్ ల ఆధారంగా చెప్పవచ్చు. మొదటి ప్రొసీడింగ్స్ లో సీనియర్ అసిస్టెంట్ ఎస్పీపీ 1ఏ (ప్రత్యేక వేతన రక్షణ) 12 సంవత్సరాల పెంపు. సబ్జెక్ లో వచ్చే సరికి సీరియల్ నంబర్ 3లో  సీనియర్ అసిస్టెంట్ పేరు ఉంటుంది. చివరి లో కింద క్లర్క్ ఇనీషియల్ అండ్ డీఈఓ గుర్తు ఉంటుంది.  రెండవ ప్రొసీడింగ్స్ జూనియర్ అసిస్టెంట్ ఎస్పీపీ1ఏ  (12సంవత్సరాల పెంపు) అపాయింట్‌మెంట్ తేదీ 6.6.2008 నుండి 12 సంవత్సరాల పెంపు 6.6.2020 కి ఇవ్వాలి. కానీ 1.6.20 వరకు ఇచ్చారు. థర్డ్ ప్రొసీడింగ్స్ లో ప్రొసీడింగ్స్ ఆఫ్ డిస్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బదులు ప్రభుత్వ డిప్యూటీ (డైట్)ప్రస్తుత డీఈఓ  పేరు బదులు మరొకరి పేరు ఉంది. సీనియర్‌ ఎస్‌ఎస్‌ఏ నుంచి డీఈవో ఆఫీస్‌కు స్వదేశానికి పంపుతున్న ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కింద క్లర్క్, డీఈఓ  సంతకం ఉంది. ఫోర్త్ ప్రొసిడింగ్స్ లో సీనియర్ అసిస్టెంట్ 1.7.2024 నుండి 30.09.2024వరకు సెలవులో ఉన్నారు. 1.10.2024న తిరిగి విధుల్లో చేరారు. కాని ప్రొసీడింగ్స్ మాత్రం 1.7.2024  నుండి 14.10.2024 వరకు ఎల్స్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అభ్యర్థి 1.10.2024 లో జాయిన్ అయితే 15 రోజులు పూర్తి కానప్పుడు సీఎల్ఎస్ కాస్త చికిత్స చేసి సంబంధిత నెలలో అంటే అక్టోబర్ 24 లో జీతం చేయాలి. కానీ విరుద్దంగా ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నారు. ట్రెజరీ లో ఏటీఓ లో బిల్లులు పాస్ కాలేదు.

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని తప్పుడు ప్రొసిడింగ్ లు వస్తుండగా ఉన్నత స్థాయి అధికారులు చూడకుండా సంతకాలు పెడుతున్నారా అన్న సంశయాలు వ్యక్తమౌతున్నాయి. క్లర్క్ లు కార్యాలయం సూపరింటెండెంట్ సంతకాలు చేసిన తర్వాత వాటిని పరిశీలించి సంతకాలు చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులది. కానీ అధికారులు కార్యాలయంలోని సిబ్బందిపై భారం వేసేసి వాళ్ళు తయారు చేసిన ప్రొసిడింగ్ లపై చూసి చూడకుండానే సంతకాలు చేస్తున్నారని స్పష్టమౌతుంది. డిఈవో కార్యాలయం అధికారుల తీరు వల్ల ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది నష్టపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల తీరు కారణంగా ట్రెజరి ద్వారా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పదవి విరమణ చేసిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ తో పాటు వేతనాలు ఆలస్యమౌతుంది. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలు కార్యాలయం సిబ్బంది అధికారుల తీరుపై గుర్రుగా ఉన్నారు.

More articles

Latest article