24 C
Hyderabad
Sunday, August 2, 2026

కారణజన్ముడు వైయస్ రాజశేఖర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువ నాయకులు సాయిని అశోక్ మాట్లాడుతూ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరితార్థుడు,చరిత్రకారుడు,కారణ జన్ముడు,రైతు పక్షపాతి,వ్యవసాయం దండుగ కారాదు,పండుగ కావాలని ఆశించినవాడు,అందుకే ఉచిత విద్యుత్,వ్యవసాయ రుణాల మాఫీ,విద్యుత్ బకాయిల మాఫీ,పంటల బీమా,ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పక్షపాతిని, అపర భగీరథుడు,తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టు బాట పేరిట సాగునీటి ప్రాజెక్టుల లో సింహభాగం పూర్తి చేసారు అనిఅన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మహిళా పక్షపాతి,డాక్రా మహిళా సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని ,అభయహస్తం పథకాన్ని అమలు చేశారన్నారు. పేదల పక్షపాతి.అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు.అర్హులందరికీ ఫించన్లు ఇవ్వడం జరిగిందన్నారు. .ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా,ఒక సారి సీఎల్పీ లీడర్ గా,2 సార్లు పిసిసి అధ్యక్షులుగా,2 సార్లు ముఖ్య మంత్రి అయ్యారన్నారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయం అన్నారు. ఆయన ఆశయ సాధనకోసం అంకితం,పునరంకితం అవుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Karanjanmudu YS Rajasekhar Reddy

 

More articles

Latest article