28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు:  కేంద్ర కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఓబీసీ మోర్చా భిక్కనూరు మండల శాఖ   ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చిన్నోళ్ల శంకర్  మాట్లాడుతూ జనగణనతో పాటు కుల గణన చేయాలని కేబినెట్లో మోడీ తీసుకున్న నిర్ణయానికి  సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చెయ్యడం జరిగిందని, ఈ నిర్ణయము భారతదేశ ప్రజలు హర్షించదగినదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ చేసిన కులగనన అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా తప్పులు తడకగా ఉన్నదని, ఇప్పుడు కేంద్రం చేపట్టబోయే జనగణన, కులగనన తో అన్ని వర్గాల యొక్క జనాభా పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని దాని ప్రకారమే ప్రభుత్వ పథకాలు ఇతర స్కీములు వర్తింప చేయబడతాయని, ఇలాంటి సాహసోపేత నిర్ణయం మోడీ గారికె సాధ్యమని గత ప్రధానులెవ్వరు ఇలాంటి ధైర్యం చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్ ఉపాధ్యక్షులు నాగర్తి నరేందర్ రెడ్డి అరిగే నరసింహులు ఏక్ నాథ్ యాదగిరి గౌడ్ ఉన్నారు.

Adoration of Modi's portrait

More articles

Latest article