మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

బతుకమ్మ, భిక్కనూరు:  కేంద్ర కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఓబీసీ మోర్చా భిక్కనూరు మండల శాఖ   ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చిన్నోళ్ల శంకర్  మాట్లాడుతూ జనగణనతో పాటు కుల గణన చేయాలని కేబినెట్లో మోడీ తీసుకున్న నిర్ణయానికి  సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చెయ్యడం జరిగిందని, ఈ నిర్ణయము భారతదేశ ప్రజలు హర్షించదగినదన్నారు. ...