26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తెయూ నుండి అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయం  ఫార్మాస్యుటికల్  కెమిస్ట్రీ  విభాగంలో 8వ సెమిస్టర్ చదువుతున్న సింగని సాయి వర్ధన్  ఇస్రో అనుసంధాన ఆస్ట్రో ఫిజిక్స్ లేబరేటరీ బెంగళూరులో అంతరిక్ష శాస్త్రంలో పరిశోధన చేయడానికి  సమ్మర్ ఫెలోషిప్ కు ఎంపిక కావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని  రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి  పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక స్థాయి నుండి విద్యనుభ్యసించిన  సాయి వర్ధన్  ప్రస్తుతం  తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సెమిస్టర్ పూర్తి చేశాడు.  ఈ సందర్భంగా రిజిస్టర్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ సాయి వర్ధన్   విశ్వవిద్యాలయంలో లోతైన  పరిశోధన చేసి అంతరిక్ష శాస్త్ర శాస్త్రవేత్తగా ఎదగాలన్నారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న విభాగ అధ్యాపకుల సేవలను రిజిస్ట్రార్  అభినందించారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ స్ఫూర్తిదాయకం..

తెలంగాణ విశ్వవిద్యాలయం  ఫార్మాస్యుటికల్  కెమిస్ట్రీ  విభాగంలో 8వ సెమిస్టర్ చదువుతున్న  కానుగుల విశ్వేశ్వరి  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాసెస్ కెమిస్ట్రీలో  పరిశోధన చేయడానికి   సమ్మర్ ఫెలోషిప్ కు  ఎంపిక కావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని  రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి  పేర్కొన్నారు.  కుమారి విశ్వేశ్వరీ  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూపన్ పల్లి లో పదవ తరగతి వరకు  విద్యను అభ్యసించి బోధన్ విద్యా వికాస్ లో  ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం  తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సెమిస్టర్ పూర్తి చేసింది.  ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని తన ప్రతిభ పాటవాలతో  ఉన్నత విద్యలో ముందుండడం అభినందనీయమని  రిజిస్ట్రార్  పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న  విభాగ అధ్యాపకులను అభినందించారు.

From a student to a space scientist

More articles

Latest article